ఒక నిజంతో ఈ టపా మొదలెట్టనీయండి. పలు కారణాల వల్ల మా ఆవిడకు నాకూ మధ్య గత మూడు నెలల వరకు ప్రేమలేదు. అప్పటివరకూ మా ఇద్దరి మధ్య ద్వేషమే వుండేది. ఓ మూడు నెలల నుండి మామధ్య ప్రేమ లేకున్నా స్నేహం పెరిగింది. ఈ స్నేహం చూస్తుంటే...
...ప్రేమ వద్దు... ఈ స్నేహమే మధురంగా వుందనిపిస్తోంది. ఎందుకంటే ప్రేమించామనుకోండి - కమిటవ్వాలి. అప్పుడు ఇరువురిలో స్వార్ధం, పొజెసివ్‌నెస్ పెరుగుతుంది. అందువల్ల మొదట్లో బావున్నా తరువాత ఆరెంజులో చెప్పినట్లు ప్రేమ ఫేడవుతూ అబద్ధాలు ఫార్మ్ లోకి వస్తాయి. అందుకే నాకు పాలియమోరీ పెళ్ళి/జీవన విధానం ఇష్టం. అందులో భర్త భర్తే, ప్రియుడులు, ప్రియురాల్లు వాళ్ళే, అలా విశాలభావాలతో నడుస్తుంటుంది.
నా పెళ్ళి చూపుల్లో మా అవిడతో మనం పాలియమోరీ విధానంలో జీవించాలని - అలా ఇష్టమయితేనే నన్ను పెళ్ళాడమనీ చెప్పాను. పెళ్ళి చూపుల్లో ఆ విధానానికి ఒప్పుకుంది కాబట్టే ఓ ఎగేసుకొని పెళ్ళి చేసుకున్నాను కానీ పెళ్ళయ్యాక ప్లేటు ఫిరాయించింది. క్యోం అంటే బొమ్మరిల్లు సినిమాలోలాగా ఆ ఏం కాదు, పెళ్ళయిన తరువాత అందరూ మారతారులే అని మా నాన్నగారు చెప్పేరండీ అంది!
ప్రేమలో మనం ఎంత ప్రేమించినా అది తక్కువే అవుతుంది. అదే స్నేహంలో అయితే? ఏ కొద్ది ప్రేమ చూపించినా ఎక్కువగానే కనపడుతుంది. అనిపిస్తుంది. అది ఎక్స్‌పెక్ట్ చేయని, ఆశించని ప్రేమ కాబట్టి ఉదాత్తంగా వుంటుంది. ప్రేమలో వుండి ఎంత ప్రేమిస్తే మాత్రం ఏం వుందండీ - అందులో అదంతా క్యాజువలే కదా. పెద్ద గొప్ప అనిపించదు. స్నేహంలో ఆత్మవంచనలు వుండవు. అంతగా అబద్ధాలు చెప్పాల్సిన అవసరాలు వుండవు. ఎక్కువగా దాపరికాలు వుండవు. ఇష్టమయిన విషయాల్లో కలిసి పనిచేస్తాం, కష్టమయిన విషయాల్లో విడివిడిగా వుంటాం. ఒకవేళ ఏదన్నా చిన్న అబద్ధం చెప్పి అది బయటపడ్డా సమయ్స వుండదు. మన గురించి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఓ వెకిలి నవ్వు నవ్వేస్తే సరిపోతుంది.
అదే ప్రేమలో అయితే ఓ చిన్న దాపరికం బయటపడ్డా మనస్సు దహించివేస్తుంది. అక్కడినుండి అలకలు, కన్నీళ్ళూ, అపార్ధాలూ, హామీలూ, మరీని అబద్ధాలూ, మరింత దాపరికాలూనూ. మాలో చక్కటి స్నేహం తప్ప ప్రేమ లేదు కాబట్టి మాకు ఈ సమస్యలు తక్కువుగా వుంటున్నాయి. అంటే మా స్నేహమేదో పరిపూర్ణమయిన స్నేహం కాదు. ఇంకా కొన్ని బాలారిష్టాలలోనే వుంది. ఇంకా ఫైన్ ట్యూనింగ్ అవసరం కానీ ఒక మూడు నెలలుగా ప్రోగ్రెస్ వుంది తప్ప మా స్నేహం దారి తప్పలేదు.
అంటే ప్రేమని నేను తకువ చూపు చూస్తున్నట్లు కాదు. ప్రేమలో దహించుకుపోవడం, ఆరాధించడం అంటే నాకూ ఇష్టమే. నిజమయీన ప్రేమ అన్నది కేవలం 18 నెలలే వుంటుందని మనో శాస్త్రవేత్తలు ఎప్పుడో సెలవిచ్చారు. ఆ తరువాత ప్రేమలో వున్నామని అనుకుంటాం అంతేనట. ఆరెంజ్ సినిమాలో ఈ 18 నెలల విషయం చెబుతాడేమో అని చూసాను కానీ చెప్పినట్లు లేడు. కొంతకాలం అని చెప్పాడు కానీ నిర్దిష్టంగా చెప్పలేదు. అందుకే మా ఆవిడతో స్నేహం - మిగతా వారితో ప్రేమ. ఎప్పుడూ ఎవరితో ఒకరితో ప్రేమలో కాలిపోతూనేవుంటాను. అందులో సమస్యేం లేదు. ఆ ప్రేమ పలుచబడ్డాక మరొకరిని వెతుక్కుంటూనే వుంటాను. ఇలా జీవితాంతం ప్రేమిస్తూనే వుంటాను. ఎవరినో ఒకరిని ఆరాధిస్తూనేవుంటాను. నిజమయిన ప్రేమను నా కుర్రతనం నుందీ ఇలా ఆస్వాదిస్తూనే వున్నాను - ఇకముందు కూడా అలాగే వుంటాను. చరణ్ కి పది నెంబర్లేమో కానీ నాకు అలా ఎన్ని నంబర్లు దాటిపోయాయో నాకే తెలియదు మరి.
మా ఆవిడకి నా సంగతంతా తెలిసిదే కాబట్టి, ఆమె దగ్గర నా జీవితం తెరచిన పుస్తకమే కాబట్టి కాస్త అప్పుడప్పుడూ నసిగినా మా పట్ల ద్వేషం లేకుండా చక్కని స్నేహం నడుస్తోంది కాబట్టీ ఆమెకూ పెద్దగా ఇబ్బంది లేదు. మిగతా చాలా మందిలా నేను ఇంట్లో రామయ్యనూ, వీధిలో కృష్ణయ్యను కాదు కాబట్టి నాకు ఇంట్లో ఆ క్రెడిబిలిటీ వుండనే వుంటుంది. అప్పుడప్పుడూ మా స్నేహం ఎక్కువయ్యి మా ఆవిడనీ ప్రేమించాలని అనిపిస్తుంది కానీ ఇంకేమన్నా వుందా ఇక అంతే సందు దొరికిందని నన్ను కట్టిపడెయ్యాలని చూడదూ. అందుకే నా మనస్సుకి అప్పుడు నేను నో, థేంక్స్ అని చెప్పుకుంటూవుంటాను.
స్నేహంగా వుండే ప్రియురాలే మనకు వున్నట్లయితే ఇంకా మధురంగా జీవితం వుంటుంది కానీ అలా నిజంగా ఎంతమందికి దొరుకుతారు? అయితే చాలా మందీ తాము అలాంటి జంటలమే అనుకుంటూ వుంటారు. తమ జతని అలా నమ్మిస్తూవుంటారు, తామూ నమ్ముతూ వుంటారు. భ్రమల్లో బ్రతులు లాగిస్తూవుంటారు. అలాంటి జీవితం నాకొద్దు బాబోయ్.
మాలో ఇన్నాళ్ళుగా లేని స్నేహం ఇప్పుడు ఎలా చిగురించింది మరియు ఎలా మొగ్గలేస్తోందీ అనేది మరో టపాలో వివరంగా చెప్పుకుందాం. ఇదివరకూ కొన్ని టపాల్లో కొంత ఆల్రెడీ మీకు వెల్లడించాను.

6 comments:
అన్న కొంపదీసి నువ్వే ఆ సినిమాకి ఘోస్ట్ రచయితా ఏంటి?
చరణ్ అనే ప్రేమకి నీ ప్రేమకి తేడ ఉంది :p
ఇక్కడి (వెస్ట్రన్) సమాజంలో ఇటువంటి (Polyamory) విషయాల్లో ఇద్దరి మధ్య అవగాహన ఉంటె తప్ప పెళ్లి లాంటి పెద్ద
బంధంలోకి అడుగువేయ్యరు.
Ayn Rand గురించి ఓ సారి చదవండి wikipediaలో.
>>>ప్రేమలో మనం ఎంత ప్రేమించినా అది తక్కువే అవుతుంది. అదే స్నేహంలో అయితే? ఏ కొద్ది ప్రేమ చూపించినా ఎక్కువగానే కనపడుతుంది. అనిపిస్తుంది.
సూపర్. బాగా చెప్పారండి.
Below statements are super!
ప్రేమలో మనం ఎంత ప్రేమించినా అది తక్కువే అవుతుంది. అదే స్నేహంలో అయితే? ఏ కొద్ది ప్రేమ చూపించినా ఎక్కువగానే కనపడుతుంది. అనిపిస్తుంది. అది ఎక్స్‌పెక్ట్ చేయని, ఆశించని ప్రేమ కాబట్టి ఉదాత్తంగా వుంటుంది. ప్రేమలో వుండి ఎంత ప్రేమిస్తే మాత్రం ఏం వుందండీ - అందులో అదంతా క్యాజువలే కదా. పెద్ద గొప్ప అనిపించదు. స్నేహంలో ఆత్మవంచనలు వుండవు. అంతగా అబద్ధాలు చెప్పాల్సిన అవసరాలు వుండవు. ఎక్కువగా దాపరికాలు వుండవు. ఇష్టమయిన విషయాల్లో కలిసి పనిచేస్తాం, కష్టమయిన విషయాల్లో విడివిడిగా వుంటాం. ఒకవేళ ఏదన్నా చిన్న అబద్ధం చెప్పి అది బయటపడ్డా సమయ్స వుండదు. మన గురించి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఓ వెకిలి నవ్వు నవ్వేస్తే సరిపోతుంది.
@ శ్రీకాంత్
హ హ. ఈ సమాజం కంటే ఎప్పుడూ నేను ముందుంటాను. మీరు అవన్నీ సినిమాల్లో చూస్తుంటారు - నేను జీవిస్తుంటాను. అయాన్ రాండ్ చదవాలనుకుంటూనే కాలం గడిచిపోతూనేవుంది. కనీసం తన గురించి అన్నా వివరంగా చదవాలి.
@ జెబీ, లక్ష్మణ్
నా మాటలు మీకు నచ్చడం నాకు ఆనందకరంగా వుంది.
last 3months lo mee blog baghaa nachutundi , kaaranam idaaa :)
>>ఆరెంజ్ సినిమాలో ఈ 18 నెలల విషయం చెబుతాడేమో అని చూసాను కానీ చెప్పినట్లు లేడు.
inkaa nayyam...ee matram collections kooda undav :)
ayinaa yE 18 months??? pellayyakaaa? leka propose chesaakaa?
leka meeru next year V-day ki mee wife ki lover gaa maraakaa 18 months aaa?
hi hi hi...saradagaaaa :) kaakunte aa 18 months repeat avvachu same person to koodaaa :)
ade cheppadu orange lo ??? idedo kotha discovery laa undE :)
"ఎప్పుడూ ఎవరితో ఒకరితో ప్రేమలో కాలిపోతూనేవుంటాను. అందులో సమస్యేం లేదు. ఆ ప్రేమ పలుచబడ్డాక మరొకరిని వెతుక్కుంటూనే వుంటాను. ఇలా జీవితాంతం ప్రేమిస్తూనే వుంటాను. ఎవరినో ఒకరిని ఆరాధిస్తూనేవుంటాను. నిజమయిన ప్రేమను నా కుర్రతనం నుందీ ఇలా ఆస్వాదిస్తూనే వున్నాను - ఇకముందు కూడా అలాగే వుంటాను. చరణ్ కి పది నెంబర్లేమో కానీ నాకు అలా ఎన్ని నంబర్లు దాటిపోయాయో నాకే తెలియదు మరి."
అన్నా ,
నువ్వు నేను సేమ్ పించ్ ఈ డైలాగ్ లో .. :-)
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి