గురువారం 2 డిసెంబర్ 2010

కారు మల్లయ్య - బోడ మల్లయ్య

మా ఆవిడకి కష్టపడి కారు డ్రైవింగ్ నేర్పించాను. ఆ తరువాత ఏమయ్యిందీ?

http://www.youtube.com/watch?v=kDX7SiCm3Us

8 comments:

Rishi చెప్పారు...

చిన్న సలహా సార్,బ్లాగు రాయండీ యూట్యూబ్ లింకుల కంటే..చక్కటి ఉదాహరణలు,ఉపమానాలతో రాస్తారు మీరు.

సరదాగా ఉందనుకోండి మీ ఈ వీడియో :) వీడియో లో మీరు 'అదీ" ఇదీ" అని తడబడటం బాగుంది .....

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ రిషి
బ్లాగులు వ్రాసేవారూ, అందులో చక్కగా వ్రాసేవారు ఎంతమందో వున్నారు కానీ ... నాలాగ వీడియో బ్లాగింగ్ చేసేవారు తెలుగులో ఎంతమంది వున్నారు చెప్పండి? చాలా కొద్దిమందే మిగులుతారు. ఏదో ఒక్కటి రెండూ వీడియోలను వేసిన వారినీ, అవీ ఇవీ తీసుకొచ్చి వీడియోలుగా వేసిన వారినీ వదిలేస్తే చాలా కొద్దిమందే మిగులుతారు. నలుగురితోపాటు నారాయణా - పదిమందితో పాటు గోవిందా అనడం నాకు నచ్చదు - ఎప్పటికప్పుడు మనమంటూ ఓ ప్రత్యేకత సాధించుకుంటూవుంటుండాలీ, నిరూపించుకుంటూవుంటుండాలి. కాదూ?

వీడియో బ్లాగుల్లో ఇంకా నేను బాలారిష్టాలలోనే వున్నాను. ఇంకా సాధనలోనే వున్నాను. ఇంకా పలు మార్గాల నుండి నాకు పలు సూచనలు, సలహాలు అందుతున్నాయి. వాటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నా వీడియోలు మెరుగుపరచుకుంటున్నాను. అనతికాలంలోనే ఇంకా ధారాళంగా, సరళంగా, సరదాగా, తడబాట్లు లేకుండా, మరింత వైవిధ్యంగా మాట్లాడగలను. చూస్తూ వుండండి :)

అయితే టపాలు చదివినంత ఈజీగా వీడియోలు చూడటం చాలామందికి కుదరదు, అంత సమయం వుండదు అని నాకు తెలుసు. అందువల్ల వీడియో హిట్లు తగ్గి నేను చెప్పాలనుకున్నది బ్లాగులోకంలో ఎక్కువమందికి చేరకపోవచ్చును. అయితే వీడియోల వల్ల తెలుగు చదవలేని వారికి కూడా, తెలుగు బ్లాగోస్ఫియరులో లేని వారికి కూడా నా వీడియోలు అందుబాటులోకి వస్తాయి. అలా నా పరిధి, నాకు ఆదరణ, గుర్తింపూ విస్తృతం అవుతాయి. ఎంతకాలం బావిలో కప్పలాగా ఈ తెలుగు బ్లాగుల్లోనే కెలుక్కుంటూవుంటాం? మిగతా జనాల బుర్రలూ తినాలి కదా మనం. ఏమంటారు? అలా అని టెక్స్ట్ బ్లాగింగ్ వదిలెస్తానని కాదు. ఏది వీలయినప్పుడు అదే.

అజ్ఞాత చెప్పారు...

video to patu post kuda rayandi. mee video bagoledu ani kadu naku mee txt bloginge ishtam . emi anukokandi ela cheppenani.

Indian Minerva చెప్పారు...

పై అజ్ఞాత చెప్పినట్లు చెయ్యండి. తెలుగు విని కాక చదివిమాత్రమే అర్ధం చేసుకోగల నాలాంటి వింతజీవులకు పనికొస్తుంది.

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ అజ్ఞాత, మినర్వా
ప్రస్తుతానికి కొన్ని ప్రయోగాలు చేస్తున్నప్పటికీ యూట్యూబులో సెన్సారింగ్ ఎక్కువగా వుండదు కాబట్టి ఎక్కువగా అడల్ట్ సమాచారం వున్న వీడియోలే వెలువరించదలుచుకున్నాను. అవి ఎలాగూ నా ప్రధాన బ్లాగుల్లో పొస్ట్ చేయను. యథావిధిగా నా టెక్స్ట్ టపాలూ వుంటుంటాయి. కొన్నిసార్లు మామూలు వీడియోలు వెలువరించినా అవి ముఖ్యంగా యూట్యూబు ప్రేక్షకుల కోసమే. ఎలాగూ వీడియోలు చేస్తున్నా కాబట్టి నా బ్లాగుల్లో వేస్తుంటా కానీ అవి ముఖ్యంగా బ్లాగు పాఠకులను ఉద్దేశ్యించి తయారుచేసినవి కాదు.

నా బ్లాగు టపాలకై మీరు చూపుతున్న ప్రాధాన్యానికి సంతోషిస్తూ యథావిధిగా నా టపాలు వుంటుంటాయనీ, వాటికి అదనంగా మాత్రమే నా వీడియోలు వుంటాయనీ, వీడియోల మీద ఆసక్తిలేనివారు వాటిని మినహాయించవచ్చనీ తెలియజేసుకుంటున్నాను.

కొత్త పాళీ చెప్పారు...

Quite hilarious :)
చివర ట్విస్టు తెలుగు సినిమా క్లైమాక్సంత బాగుంది.
మధ్యమధ్యలో మనది పన్నెండేళ్ళ ఇండస్ట్రీ ఎక్స్పీరియెన్సు అనడం కూడా!
ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్ అని పాతపలుకుబడి.
ముదితల్ పోవగ రాని చోటుగలదే కారు లైసెన్సు చేజిక్కినన్ అని కొత్త సామెత :)

swapna@kalalaprapancham చెప్పారు...

title balega unde :)
mottaniki mi wife ki license vachindanamata. gr8
ipudu miru boda mallaiah ayyara papam :(
miru paniki rakunda ayipoyanu ani enduku anukuntaru mike konchem relax dorikindi ani anukovachhuga mi wife drive chestundi kabatti.

ika nunchi mi wife chetike driving ichheyandi miru enchakka car lo hai ga kurchondi emantaru :)

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ కొత్తపాళీ
:)

@ స్వప్న
తను కారు డ్రైవింగులో బాగా పరిణతి సాధించేదాకా పక్కన హాయిగా కోర్చోలేనులెండి. పక్కన టెన్షనుతో కూర్చోవాల్సిందే. మా ఆవిడ కారు నడుపుతూవుంటే ఎంచక్కా వెనక సీట్లోకి వెళ్ళి గుర్రుకొట్టే దృశ్యం నాకు రావడానికి ఇంకా చాలా సమయమే వుంది :)