ప్రొద్దుటే మొదలవుతుంది నా హింసా కార్యక్రమం . నేను లేచి ఆఫీసుకి తయారవుతుంటాను కానీ తాను ఎంచక్కా ఇంకా పడుకునేవుంటుంది. వారాంతాలలో మధ్యాహ్నం నా నిద్ర తను చెడగొట్టకూడదని, తన ఉదయం నిద్ర నేను చెడ్గొట్టకూడదని ఓ అంగీకారానికి వచ్చేంలెండి. క్రితం రోజు రాత్రే అఫీసుకి లంచ్ ప్యాక్ చేసిపెడుతుంది. సో, తాను అలా శుబ్బరంగా నిద్రోతుంటే మనం ఆఫీసుకి కాళ్ళీడ్చుకుంటూ వెళ్ళాలంటే ఎలాగయినా మండుద్ది కదా. అందుకే ఆఫీసుకి రెడీ అవుతూ హింసిస్తానన్నమాట. ఎలా అంటారా - నా పాటలతో. ఇలా వుంటాయి నా పాటలు - జన్మమెత్తితిరా, అనుభవించితిరా అనో కరుణించు నా దేవా, నడిసంద్రంలోనా అనో ఓ గొంతెత్తిపాడేస్తుంటాను - తనకు నిద్రాభంగం కావాలని. తననుండి ప్రతిస్పందన ఏమయినా వుంటుందా - వుండదు. తను అరిస్తే నేను ఇంకా స్వరం పెంచేస్తానని మా ఆవిడకి తెలుసు. రెస్పాన్స్ పక్కగది నుండి వస్తుంది - డేడీ షటప్ అనీ. నేను అలాగే కంటిన్యూ అయిపోయాననుకోండీ - మా అమ్మలు కూడా స్వరం పెంచుతుంది. ఏడుపు స్వరం. అదసలే ఏడుపులో ఎక్సుపర్టూ. నేను మూసుకొని ఆఫీసుకి ముందడుగువేస్తుంటాను.
ఇహ సాయంత్రం ఆఫీసు నుండి వచ్చాక మా ఆవిడని ఎలా చిత్ర హింసల పాలు చేస్తానో మరి కొద్ది సేపట్లో...

4 comments:
అన్నా నీ పాటలు "నీ గొట్టం" ( youtube ) లో చూసా
పాపం ఎలా తట్టుకుంతున్నారో
@ అప్పూ
హ హ. మా నాన్న వ్రాసిన పాటలు పాడుతూ/ప్రాక్టీసు చేస్తూ ఇల్లంతా తిరుగుతూ కూడా చిత్రవధ చేస్తుంటాననే సంగతి మీరంటే గుర్తుకువచ్చింది.
:-))
@ క్రిష్ణప్రియ
:D
మిగతా భాగం వ్రాయాలి కానీ దానికి తీరిక ఇంకా దొరకలేదు.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి