డేల్ కార్నెగీ ఓ మాట చెప్పాడు "మీరు సంతోషంగా లేరా? సంతోషంగా వున్నట్లు నటించండి. కొద్ది సేపట్లోనే మీ మనస్సు సంతోషంతో నిండుకుంటుంది". సరిగ్గా ఆ మాటలే కాకపోయినా అలాంటి అర్ధం వచ్చే మాటలే వారు అన్నారు. మీరు ఉదయం లేచిన వెంటనే ఏదో కారణాల వల్ల మీరు సంతోషంగా లేరు. అయినా సరే మీ పెళ్ళాన్నీ, పిల్లలనీ, పొరుగువారినీ, ఆఫీసులో పనిచేసేవారినీ ఉత్సాహాంగా సంతోషమంతా పులుముకొని పలకరించండి, మాట్లాడండి. తెచ్చిపెట్టుకున్న హుశారుతో పనిచెయ్యండి. మన మనస్సు బొత్తిగా అమాయకమయినది. దానికి నిజమేంటో, కల్పనేంటో తెలియదు. ఉదాహరణకు ఓ నారిజపండు ఊహించుకోండి. పండు మీ ఎదురుగ్గా లేకున్నా నోరు ఊరడం లేదూ? పోనీ ఆవలింత ఊహించెయ్యండి. మీకూ ఆవలించాలని అనిపిస్తోందా లేదా? నేనప్పుడే ఆవలించేసాను. అలాగే మీరు కల్పిస్తున్న సంతోషాన్నే నిజమనుకొని సాధారణంగా మన మనస్సూ ఆనందపడుతుంది. పిచ్చి మనస్సు. కదూ.
అలాగే నాకే ఆశ్చర్యకరంగా నా కొత్త విధానాలు పనిచేస్తున్నాయి. మా ఆవిడ పట్ల అనురాగం బలవంతంగా ప్రదర్శిస్తూ అదే అనురాగాన్ని బలవంతంగా డిమాండ్ చేస్తున్నాను కదా. ఎంతకాలం ఈ నడుస్తుందేంటి ఈ నటన అనుకున్నాను కానీ మూడు రోజుల్లో మార్పు వచ్చింది. మా మధ్య ఇదివరకటికెన్నడూ లేని పరస్పర అనురాగం, శ్రద్ధా, ఆనందం, ఆప్యాయతా, సరదా అన్నీ మొదలయ్యాయి. చప్పట్లు :) నిజంగా ఈ ఎఫెక్ట్ నాకే నమ్మశక్యం కాకుండా వుంది. మా ఆవిడ ఈ బలవంతపు అనుబంధంతో ఇంకా బోరయిపోతుందేమో అనుకున్నా కానీ ఫోర్సుఫుల్ లవ్ కూడా రియల్ లవ్వుకి దారి తీస్తుందని ఊహించలేకపోయాను. అప్పుడనుకున్నాను - ఓ ఇలాక్కూడా పని జరుగుతుందన్నమాట అని. మరి ఈ ఆనందం ఎంతకాలం వుంటుందో, ఎప్పుడు ఆవిరి అవుతుందో తెలియదు కానీ సో ఫార్ సో గుడ్.
దంపతుల్లో ఒకరినొకరు అంతగా ఇష్టపడక పోవడానికీ, కలహాలకూ, కీచులాటలకూ ఎన్నో కారణాలు వుండవచ్చు. అది బలవంతం పెళ్ళి అయ్యుండటమో, అలవాట్లో, వ్యసనాలో ఒకరివి మరొకరికి నచ్చకపోవడమో, వ్యక్తిత్వాలు కలవకపోవడమో, అంతస్థులు కలవకపోవడమో, అందాలు కలవకపోవడమో, ఆనందాలు మిళితం కాకపోవడమో అలా ఏ కారణాలు అయినా అయ్యొండొచ్చు. ఇష్టం లేకపోతే సింహద్వారం ఎప్పుడూ తెరిచేవుంటుంది - వెళ్ళడమో, వెళ్ళగొట్టడమో చెయ్యాలి. హక్కులు ఏమయినా వుంటే బయటకి వెళ్ళి నిరూపించుకోవాలి. ఇంట్లో వుండి మొగుడూ పెళ్ళాలు సాధించుకుంటూ అదే హక్కుల పోరాటం అనుకోవడాన్ని నేనయితే అంగీకరించను. ఇంట్లో వున్నావూ అంటే ఇష్టపడివుండాలంతే. అయిష్టం ఎందుకనేది అనవసరం కానీ ఇష్టం లేదూ బయటకి నడవాలంతే. ఇక్కడ ఎవరూ ఎవరికీ బానిసలు కారు - బయటకెళ్ళి బ్రతికే స్వేఛ్ఛ అందరికీ వుంటుంది. ఇంట్లో వుండి సాధించడమే స్వేఛ్ఛ అనుకుంటే కుదరదు.
గత పదిహేళ్ళ నుండీ మా ఇంట్లో మార్పు కోసం ఓపికగా, సౌమ్యంగా, ఎన్నో విధాలుగా, పలు రకాలుగా కృషిచేస్తూనే వస్తున్నాను. లాభం లేకపోయింది. చివరికి నా విధానాలలోనే పొరపాటు వుంది అని గ్రహించాను. ఎదుటివారిని మార్చడం కాదు - అసలు నేనే మారాల్సి వుంది అని గ్రహించాను. ఆ విధంగా నేను మారాను - నా విధానాలూ మార్చుకున్నాను. మారిన విధానాలు ప్రయోగించాను - ప్రస్తుతానికయినా ఫలితం సాధించాను. దాదాపు ఓ పదిహేనేళ్ళుగా గడ్డకట్టుకొనిపోయి మంచుశిలలయిన మా మనస్సులు ఇప్పుడిప్పుడే మళ్ళీ వెచ్చని అనురాగాలకు, ఆప్యాయతలకు కరగనారంభించాయి. ఇకముందంటారా - చూద్దాం.
మార్పు అంటే చాలామందికి ఎందుకు అంత చిన్నచూపో నాకు అర్ధం కాదు. మార్పు అవసరం, అనివార్యం అనుకుంటే, నాకు నేను అందుగ్గాను కన్విన్స్ అవుతే మాత్రం నేనయితే ఎంచక్కా మారిపోతాను. బ్లాగావరణలో చూసుకున్నా మొదట్లోకి, ఇప్పటికీ నాలో చాలా మార్పు వుంది. ఎన్నటికీ మారనిది మార్పు ఒక్కటే అని మనం గ్రహించగలిగే మార్పు మనలో రావడం ముదావహం కాగలదు. ఆత్మవిమర్శ చేసుకునేవారు సాధారణంగా మార్పుకి సిద్ధంగానే వుంటారు. మనం మార్పుని స్వాగతించలేకపోతే మన మనస్సులు చాదస్తంగా తయారవుతాయి, బూజుపడతాయి. మార్పు అనేది మన మానసిక వృక్షానికి పోసే కొత్తనీరు వంటిది అనేది నా అభిప్రాయం.
మార్పు అంటే చాలామందికి ఎందుకు అంత చిన్నచూపో నాకు అర్ధం కాదు. మార్పు అవసరం, అనివార్యం అనుకుంటే, నాకు నేను అందుగ్గాను కన్విన్స్ అవుతే మాత్రం నేనయితే ఎంచక్కా మారిపోతాను. బ్లాగావరణలో చూసుకున్నా మొదట్లోకి, ఇప్పటికీ నాలో చాలా మార్పు వుంది. ఎన్నటికీ మారనిది మార్పు ఒక్కటే అని మనం గ్రహించగలిగే మార్పు మనలో రావడం ముదావహం కాగలదు. ఆత్మవిమర్శ చేసుకునేవారు సాధారణంగా మార్పుకి సిద్ధంగానే వుంటారు. మనం మార్పుని స్వాగతించలేకపోతే మన మనస్సులు చాదస్తంగా తయారవుతాయి, బూజుపడతాయి. మార్పు అనేది మన మానసిక వృక్షానికి పోసే కొత్తనీరు వంటిది అనేది నా అభిప్రాయం.
ఇస్త్రీవాదమో, మనువాదమో - మనక్కావల్సింది సివరాఖరుకి బ్రతుకులో ఆనందం. ఏమంటారు?


11 comments:
చప్పట్లు శరత్. మనకేం పద్ధతి సూట్ అవుతుందో మనం తెలుసుకుని పాటించడమ్ ప్రారంభిస్తే, మీరన్నట్లు అన్నీ మంచి శకునములే.
good post sarath garu, nenu mi blog chala roju lu nundi follow avuthunnanu, i never put a comment in ur blog..
బాగుంది... కానీ ఇందులో ఒక సమస్య ఉంది.. మనం ఎక్కువ కాలం ఫేక్ చేయలేము .. ఎప్పుడో ఒక సారి అనుకోకుండా బయట పడుతాం... అలా కాకపోయినా .. ఇద్దరూ సరే అనుకుని ప్రారంభించినా... ఇది ఎప్పటికైనా ప్రమాదం తెచ్చి పెడుతుంది... ఈ ఎపిసోడ్ చూడండి...
http://www.southparkstudios.com/full-episodes/s11e08-le-petit-tourette
కార్టూన్ అని వదిలేయకుండా... పూర్తిగా చూడండి...
"మీరు సంతోషంగా లేరా? సంతోషంగా వున్నట్లు నటించండి. కొద్ది సేపట్లోనే మీ మనస్సు సంతోషంతో నిండుకుంటుంది".ఇది నిజమేనండీ...
one of the best from you anna!!!!
very good post! :-)
గుడ్ పోస్ట్ శరత్ గారు.మీరు అన్నది నిజమే..మనసు పిచ్చిదే...ఏది చెబితే అది నమ్మేస్తుంది.కాని ఒక్కొసారి మనసు ఏది చెబితే మనం అది నమ్మేస్తుంటాం.అప్పుడు మొదలయ్యేవే కష్టాలు...బాధలూ.నన్నడిగితే...మనసుని కష్టపడి నమ్మించే కంటే మనం దాన్ని నమ్మకపోవడం బెటరేమో :)
@ పండు
:)
@ శివప్రసాద్
నా బ్లాగును మీరు చదువుతున్నందుకు సంతోషంగా వుంది. మీ ప్రశంసకి ధన్యవాదాలు.
@ కాయ
మీరు ఇచిన వీడియో లింక్ ఇంకా చూడలేకపోయాను.
ఎప్పటికెయ్యది ప్రస్థుతంబు అన్నట్లుగా ప్రస్థుతానికయితే ఇలా కానిచ్చేస్తాను. మళ్ళేదన్నా సమస్యలు వచ్చినప్పుడు చూద్దాం. వంతెన రాకముందే దాటడమెందుకు.
@ పరిమళం
కదా :)
@ అప్పి
థేంక్స్ :)
@ నిషిగంధ
:)
@ ఇందు
నేనయితే మన మనస్సు ఏం చెబుతుందో అది గమనించక ఇబ్బందులు కొని తెచ్చుకుంటామంటాను. చేతన మనస్సు చెప్పేది అంతగా వినిపించుకోనక్కరలేదులెండి. అంతహ్ చేతన చెప్పేది వినిపించుకుంటే అన్నీ విజయాలే. అయితే ఇబ్బంది ఏమిటంటే చేతన చెప్పినంత గట్టిగా అంతహ్‌చేతన చెప్పదు - సన్నగా గొణుగుతుందంతే. ఆ గొణుగుడు సరిగ్గా వినిపించుకున్నవాడు వీజీగా విజయుడవుతాడు.
"మీరు సంతోషంగా లేరా? సంతోషంగా వున్నట్లు నటించండి. కొద్ది సేపట్లోనే మీ మనస్సు సంతోషంతో నిండుకుంటుంది"
మరే పెళ్లయిన దగ్గర నుండీ చేస్తున్నది ఆదేగా...హీ హీ ...మగాళ్లంతా...
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి