నేను ఒకరోజు ఆఫీసు నుండి ఇంటికి వచ్చాక మా ఆవిడ వణుకుతూ అమ్మలు మీద వేడివేడి టీ పడి ఛెస్ట్ కొంచెం కాలిందని చెప్పింది. అప్పుడు మా అమ్మలుకి రెండేళ్ళు అనుకుంటా. అనిత టీ తాగుతుంటే అమ్మలు గుజిందంట - అప్పుడు ఆ టీ తన మీద వలికింది. బాగానే కాలింది. బొబ్బలు ఎక్కాయి. ఎంత నొప్పి అనిపించిందో కదా అనుకున్నాను. పొరపాటు కాబట్టి ఫర్వాలేదుగానీ మరో సారి ఇలా జరగకుండా జాగ్రత్తగా వుండు అని మా ఆవిడకి చెప్పాను.
అమ్మలు తనకు కాలిన నొప్పి మరచిపోయి హాయిగా ఆడుకుంది. అది అప్పట్లో అసలు ఏడవకపోయేది. ఈ నొప్పిని కూడా లైటుగా తీసుకుంది. కొద్ది రోజులు క్రీములు అవీ పెట్టాక ఆ బొబ్బలు మానిపోయాయి కానీ కాలిన గుర్తు అలాగే వుండిపోయింది. కట్ చేస్తే కొన్ని నెలల తరువాత ... మా అమ్మలుకి ఆరోగ్యం బాగోలేకపోవడంతో తనని మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి అనిత తీసుకువెళ్ళింది. ఆరోగ్య పరీక్షల్లో భాగంగా బాడీ పరీక్షిస్తూ శరీరం కాలిన గుర్తులు కూడా చూసాడు ఆ డాక్టర్. ఎలా జరిగిందిది అని ప్రశ్నించాడు అనితని. జరిగిన విషయం చెప్పింది. మరోసారి ఇలా అజాగ్రత్తగా వుంటే పోలీసులకి సమాచారం అందిస్తాను అని అనితని హెచ్చరించాడు ఆ డాక్టర్! మరో సారి ఇలాగే జరిగితే మరోసారి నీ దగ్గరికి వస్తానా అని అనుకుందిట అనిత.
ఇక్కడ పేరుకే మన పిల్లలు కానీ నిజంగా ప్రభుత్వం బిడ్డలు. పిల్లలని అలక్ష్యం చేస్తున్నట్లుగానీ, అబ్యూజ్ చేస్తున్నట్లు గానీ తెలిస్తే మన పిల్లలని పిల్లల సంరక్షణాలయాలకి అప్పగిస్తాయి ఈ ప్రభుత్వాలు. అది చక్కని విషయం. ఇండియాలోనయినా, ఇక్కడయినా, ఎక్కడయినా సరే పిల్లల మీద, కన్న పిల్లల మీద హింస, పలు రకాల దౌర్జన్యాలు కొంత శాతం మేరకయినా పలు కారణాల వల్ల జరిగిపోతుంటాయి. అలాంటి వాటిని కట్టడి చెయ్యాలంటే బాధ్యత గల ప్రభుత్వాలు ఇలాంటి చర్యలు తీసుకోకతప్పదు.


8 comments:
యేటి మరీ అంత సుకుమారముగానా సూసుకునేది....అట్నైతే మా పిల్లకాయలను (ఒకవేళ పెళ్ళాడితే) అక్కడకు తీసుకురాను బాబోయ్...
శరత్‌గారూ,
పిల్లలమీద హింస, దౌర్జన్యాలు నేను కూడా ఖండిస్తాను గాని, పిల్లల్ని తీసికెళ్ళి సంరక్షణాలయాలకి అప్పగించడం వల్ల, వాళ్ళు తల్లితండ్రుల ప్రేమ కోల్పోయి ఎలాంటి పిల్లలు(పెద్దలు)గా తయారౌతున్నారో ప్రభుత్వం గుర్తించలేకపోతోంది. అది నాకు ఎంతమాత్రం నచ్చదు.
ఇలాంటి సందర్భాలలో తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ఇప్పిస్తే బాగుంటుంది. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు మొగుడి మీద కోపం వస్తే, దాన్ని పిల్లల మీద చూపించే తల్లులు ఎంతో మంది వున్నారు. తమకు అడ్డు వస్తున్నారనే కారణంతో పిల్లల్ని చావబాదిన మహాతల్లూల గురించి పేపర్లో చదివాము. ఇదే గాక, కాలేజీ స్తాయిలో కూడా (ఇంజినీరింగ్ కాలేజీల్లో కూడా) పిల్లల్ని చితక్కొట్టేసె విద్యాసంస్తల్ని మా వూర్లోనే చూపించగలను. పిల్లలకి కూడా వారి హక్కుల్ని డిమాండ్ చేసే అవకాశం ఇవ్వడాన్ని నేను సమర్ధిస్తాను. మంచి విషయం చెప్పారు శరత్ గారు...
ఇలాంటి 'తొక్కలో' రూల్స్ వల్లే ఆస్ట్రేలియా లో 'అనాధ' పిల్లలు ఎక్కువ అయిపోయారు. ముఖ్యంగా 10-17 వయసు మధ్యలో వున్న వాళ్ళు. ఈ పిల్లల సంరక్షణ,పోషణ,సంక్షేమం కోసం ప్రభుత్వం గంటకొకసారి T.V. లో చందాల కోసం అభ్యర్ధన చూపిస్తూ వుంటుంది. చేసుకున్న వాడికి చేసుకున్నంత :-)
ha ha ! But studies confirm that 'Sparing the rod' has spoiled the child dearly.
If saying 'NO' is an art, facing a 'NO' is also a skill.
BTW, applying coconut oil on burns helps the skin a lot and scars/marks will disappear along with the wound. This one is a purely INDIAN chitka. :D
@ నాగార్జున, కే కే, Sujata
పోలీసులకి కంప్లైంట్ వెళితే వచ్చి మరీ పిల్లలని ఒకేసారికే లాక్కెళ్ళరు లెండి. తీవ్రతను బట్టి, నేరాన్ని బట్టి, ప్రమాదమా లేక ఇఛ్ఛాపూరితమా అన్న దానిని బట్టి హెచ్చరికలు, కౌన్సిలింగ్ మొదలయినవి వుంటాయి కదా. నేరం ఇచ్చాపూర్వకమయి తీవ్రంగా వుంటే మాత్రం తీసుకువెళతారు. తీవ్రంగా హింసించే తల్లితండ్రుల వద్ద పిల్లలు పెరగడం కంటే చైల్డ్ సర్వీసెస్ వారి దగ్గరే పెరగడం ఉత్తమం.
కొంతమంది క్రూరమయిన పేరెంట్స్ పిల్లల ఎముకలని కూడా చితక్కొడతారండీ బాబూ. గదిలో నెలలకు నెలలకు నెలలకు పైగా బంధించడం, స్థంబానికి రోజులకొద్దీ కట్టిపడేయ్యడం లాంటి ఎన్నో హింసలూ విన్నాను నేను. ఇండియాలో కూడా పలు హింసలు జరగవని కాదు గానీ వెలుగులోకి రావడం తక్కువ. అయినా మన వాళ్ళ చదువు హింసతో పోలిస్తే నేను చెప్పినవే నయ్యం లెండి.
క్రమశిక్షణ వేరు, హింస వేరు అని గుర్తించాలి. క్రమశిక్షణ పేరిట హింసిస్తునప్పుడు ఆ నిస్సహాయులను కనీసం ప్రభుత్వం అయినా ఆదుకోవడం అన్నది చక్కని విషయం కదా. నేను హింస గురించి చెబుతుంటే మీరు క్రమశిక్షణకే పోలీసులు లాక్కెళతారేమో అని భావిస్తే ఎలా?
@ జగదీశ్
మీరు విద్యాసంస్థలని నిర్వహిస్తున్నారనుకుంటాను. మీలాంటి చక్కని హృదయం వున్న వ్యక్తి చేతిలో నడుస్తున్న సంస్థలు ఎంతో పుణ్యం చేసుకొని వుండాలి. (పాప పుణ్యాల మీద నాకు నమ్మకం లేదు గానీ ఈ సందర్భానికి అంతకంటే మంచి విశేషణం గుర్తుకురాలేదు)
@ శ్రీ రాం
తొక్కలో రూల్స్. హ? పసి పిల్లల శ్రేయస్సుకోసం బజార్లో అడుక్కొని మరీ సేవ చేసినా పొరపాటు లేదు. ఆయా ప్రభుత్వాల పట్టుదలను, నిబద్దతను ప్రశంసిస్తున్నాను.
మీకు పెళ్ళయిందా? పిల్లలున్నారా? లేకపోతే కనకండి. పిల్లలమీద ఇంత కఠిన హృదయం వున్న మీకు ఇంకా పిల్లలెందుకు?
ఇక్కడ పిల్లల్ని బాగా చూస్కోవడం అటుంచండి...హింస అటుంచండి...10 కిలోమీటర్లు కారు మీద ప్రయానిస్తే 20 మంది పిల్లలు మీ వెహికేల్ కింద పడతారు ...అంత శ్రద్ద ఇక్కడ తల్లి తండ్రులకి పిల్లల మీద...
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి